Revanth Reddy: మూగ బాలుడిపై కుక్కల దాడి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

 Revanth Reddy Orders Action After Dog Attack on Mute Boy
  • హయత్‌నగర్‌లో మూగ బాలుడిపై వీధి కుక్కల దాడి
  • బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు రేవంత్ ఆర్డర్
  • వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశం
హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మూగ బాలుడు ప్రేమ్ చంద్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, ఈ ఉదయం పత్రికల్లో ఈ వార్తను చూసి కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మాట్లాడి, బాలుడికి అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.

గాయపడిన బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం... బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారికి అవసరమైన తక్షణ సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కమిషనర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా, నగరంలో వీధి కుక్కల సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా వీధి కుక్కల నియంత్రణకు తక్షణమే పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని అధికారులను గట్టిగా ఆదేశించారు.
Revanth Reddy
Telangana
Hyderabad
Street Dogs
Dog Attack
Hayathnagar
Prem Chand
Mute Boy
Dog menace
Telangana Government

More Telugu News