Lalitha Gadag: విషాదంగా ముగిసిన సహజీవనం.. బెంగళూరులో ప్రాణాలు కోల్పోయిన తెలుగు జంట!

Telugu couple dead in Bengaluru
  • బెంగళూరులో ప్రాణాలు కోల్పోయిన తెలుగు ప్రేమికులు
  • ప్రియురాలిని హత్య చేసి ఉరివేసుకున్న ప్రియుడు
  • మద్యం మత్తులో గొడవ వల్లే ఘోరం జరిగిందని అనుమానం
బెంగళూరులో ఓ జంట సహజీవనానికి విషాదకర ముగింపు పలికింది. ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ప్రియుడు, ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని నగరలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను గదగ లలిత (49),  లక్ష్మీనారాయణ (51)గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లలితకు ఇదివరకే వివాహమై పిల్లలున్నారు. కుటుంబంతో విభేదాల కారణంగా బెంగళూరు వచ్చి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఇలాంటి కుటుంబ నేపథ్యమే ఉన్న లక్ష్మీనారాయణతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో గత ఎనిమిది నెలలుగా ఇద్దరూ కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. సోమవారం విధులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగొచ్చిన వీరిద్దరూ మద్యం సేవించారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు.

మద్యం మత్తులో మాటామాటా పెరగడంతో లక్ష్మీనారాయణ ఆమెను తీవ్రంగా కొట్టి, స్పృహ కోల్పోయాక ఫ్యాన్‌కు ఉరివేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం అదే చీర మరోకొనతో అతడు కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మంగళవారం ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు కిటికీలోంచి చూడగా, ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. వారి సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, తలుపులు పగలగొట్టి మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Lalitha Gadag
Bengaluru crime
live in relationship
murder suicide
Lakshminarayana
Hyderabad woman
Rajagopala Nagar police
domestic dispute
Andhra Pradesh news
Telugu news

More Telugu News