Garuda Vega: ప్రెస్ నోట్ : అందరూ బాగుండాలి అందులో మేముండాలి అంటున్న గరుడవేగ - గరుడ బజార్

Garudavega Celebrates its 12th Anniversary with Pedal to Progress Cycling Event
  • 12వ వార్షికోత్సవం సందర్భంగా గరుడవేగ వినూత్న కార్యక్రమం
  • ఉద్యోగుల ఆరోగ్యం కోసం 'పెడల్ టు ప్రోగ్రెస్' సైక్లింగ్ ఈవెంట్
  • 100 మందికి పైగా ఉద్యోగులు, కుటుంబ సభ్యుల ఉత్సాహపూరిత భాగస్వామ్యం
  • ఉద్యోగుల శ్రేయస్సే తమకు ముఖ్యమన్న సంస్థ డైరెక్టర్ రామ్ దుర్వాసుల
  • విజేతలకు బహుమతులు, పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల ప్రదానం
ప్రెస్ నోట్:  ప్రముఖ సంస్థ గరుడవేగ డాట్ కామ్ (Garudavega.com) తమ 12వ వార్షికోత్సవాన్ని ఒక వినూత్నమైన, ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకుంది. కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా, తమ ఉద్యోగుల సంక్షేమానికి, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ 'అందరూ బాగుండాలి, అందులో మేముండాలి' అనే స్ఫూర్తిని చాటింది. ఇందులో భాగంగా, సిబ్బందిలో పని ఒత్తిడిని తగ్గించి, వారిలో ఆరోగ్య స్పృహను పెంచే లక్ష్యంతో "పెడల్ టు ప్రోగ్రెస్" పేరుతో 12 కిలోమీటర్ల సైక్లింగ్ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించింది.

ఈ కార్యక్రమం నార్సింగి సైక్లింగ్ హబ్ నుంచి టీఎస్‌పీఏ యాక్సెస్ పాయింట్ వరకు సాగింది. సుమారు 100 మందికి పైగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా ఈ సైక్లింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శ్రీరామ్ దుర్వాసుల మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్యమే తమకు అత్యంత ముఖ్యమైనదని స్పష్టం చేశారు. "శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న ఉద్యోగులే సంస్థ అభివృద్ధికి పునాది అని మేము గట్టిగా విశ్వసిస్తాం. వారిలో సుస్థిర జీవనశైలిని, పర్యావరణ చైతన్యాన్ని ప్రోత్సహించడమే మా ముఖ్య ఉద్దేశం. గతంలో కూడా వాకింగ్ ఈవెంట్ నిర్వహించాం. ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఉద్యోగులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి రావడం మాకెంతో సంతోషాన్నిచ్చింది" అని ఆయన అన్నారు.

రోజువారీ ఆఫీస్ పనుల నుంచి బయటకు వచ్చి సేదతీరడంతో పాటు, టీమ్ కోఆర్డినేషన్, పరస్పర సహకార నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది. సైక్లింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటం, కీళ్ల నొప్పులు తగ్గడం, మానసిక ఆరోగ్యం వృద్ధి చెందడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిర్వాహకులు గుర్తుచేశారు.

కార్యక్రమం ముగింపులో, సైక్లింగ్ పోటీలో విజేతలుగా నిలిచిన మొదటి మూడు టీమ్‌లకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈవెంట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సంస్థ సీఈఓ, డైరెక్టర్ల చేతుల మీదుగా సర్టిఫికేట్లను ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఉద్యోగుల ఆధ్వర్యంలో జరగడం విశేషం.
 
   
Garuda Vega
Garudavega
Cycling event
Employee health
Sriram Durvasula
Narsingi cycling hub
TSPA access point
12th anniversary
Pedal to Progress
Employee well-being

More Telugu News