Samantha's Net Worth: సమంత ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Samantha Ruth Prabhu Simple Wedding Surprises with Massive Net Worth
  • దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత వివాహం 
  • ఎంగేజ్‌మెంట్ రింగ్ విలువ సుమారు రూ.1.5 కోట్లు
  • రూ.110 కోట్లకు చేరిన సమంత నికర ఆస్తి
  • హైదరాబాద్, ముంబైలలో విలాసవంతమైన ఫ్లాట్లు
  • సామ్ వ‌ద్ద‌ ఖరీదైన కార్లు.. సొంత బ్రాండ్ తో  భారీ సంపాదన
స్టార్ హీరోయిన్ సమంత తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. నిన్న‌ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో వీరి వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా సమంత ధరించిన ఎంగేజ్‌మెంట్ రింగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. గ్రీక్ డిజైనర్ రూపొందించిన ఈ వజ్రపు ఉంగరం విలువ దాదాపు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా.

రూ.110 కోట్ల ఆస్తి!
ఇదిలా ఉంటే.. సమంత ఆస్తుల విలువ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. 2025 నాటికి సమంత నికర ఆస్తి విలువ రూ.100-110 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. సినిమాల ద్వారా ఆమె ఒక్కో చిత్రానికి రూ. 3 నుంచి 5 కోట్లు తీసుకుంటుండగా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఏటా రూ. 8 కోట్ల వరకు సంపాదిస్తున్నారు.

సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్‌లోనూ సమంత భారీగా పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్‌లో ఆమెకు రూ.7.8 కోట్ల విలువైన ఒక విలాసవంతమైన డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ ఉంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తర్వాత ముంబైలో సముద్రానికి అభిముఖంగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్‌ను రూ.15 కోట్లకు కొనుగోలు చేశారు. నటనతో పాటు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టిన సమంత, ఇటీవల ‘సీక్రెట్ ఆల్కెమిస్ట్’ పేరుతో సొంతంగా పర్ఫ్యూమ్ బ్రాండ్‌ను ప్రారంభించారు.

సామ్‌కు విలాసవంతమైన కార్ల కలెక్షన్
ఆమెకు విలాసవంతమైన కార్ల కలెక్షన్ కూడా ఉంది. వాటిలో ఆడి క్యూ7, పోర్షే కేమాన్ జీటీఎస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే, సమంత ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ కోసం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే ప్రాజెక్ట్‌తో పాటు తెలుగులో 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తున్నారు. 
Samantha's Net Worth
Samantha Ruth Prabhu
Samantha marriage
Samantha wedding
Samantha assets
Samantha net worth
Samantha real estate
Samantha cars
Ma Inti Bangaram
Secret Alchemist
Esha Foundation

More Telugu News