Sonia Gandhi: కేరళ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికరం.. బీజేపీ నుంచి 'సోనియా గాంధీ' పోటీ!

Sonia Gandhi Contests Kerala Panchayat Election on BJP Ticket
  • సోనియా గాంధీ పేరు కలిగిన అభ్యర్థి మున్నార్ నుంచి పోటీ
  • సోనియా గాంధీపై అభిమానంతో పేరు పెట్టిన తండ్రి
  • బీజేపీ నాయకుడిని పెళ్లి చేసుకోవడంతో ఆ పార్టీ తరఫున బరిలో దిగిన సోనియా
కేరళలోని మున్నార్ పంచాయతీ నుంచి బీజేపీ తరఫున సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు!... అవును, మీరు చదివింది నిజమే! ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరు కలిగిన అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేయడం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలి పేరే కలిగిన ఈ కేరళ సోనియా గాంధీ రాజకీయ ప్రయాణం ఆమెకు భిన్నంగా సాగుతోంది. అయితే కాంగ్రెస్ మాజీ అధినేత్రిపై అభిమానంతో కేరళ సోనియా గాంధీకి ఆమె తండ్రి ఈ పేరు పెట్టుకున్నారు.

బీజేపీ అభ్యర్థి సోనియా గాంధీ తండ్రి, దివంగత దురే రాజ్ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశారు. ఆ సమయంలో తన కూతురుకు ఆ పేరు పెట్టారు. కొన్నేళ్ల క్రితం ఆమెకు బీజేపీ కార్యకర్త, పంచాయతీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌తో వివాహం జరిగింది. ఈ క్రమంలో భర్త మద్దతుతో ఈ కేరళ సోనియా గాంధీ త్వరలో జరగనున్న మున్నార్ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

మున్నార్ పంచాయతీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మంజుల రమేశ్‌కు ఇది ఇబ్బందికరంగా మారింది. ప్రత్యర్థికి తమ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పేరు ఉండటం వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. కేరళలో డిసెంబర్ 9, 11 తేదీల్లో రెండు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 13న ఫలితాలు వెలువడనున్నాయి.
Sonia Gandhi
Kerala local body elections
Munnar Panchayat
BJP
Kerala politics
Congress

More Telugu News