Vaibhav Suryavanshi: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు.. 61 బంతుల్లో సెంచరీ

Vaibhav Suryavanshi Youngest Century in Syed Mushtaq Ali Trophy
  • అతిపిన్న వయస్సులో సెంచరీ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పిన వైభవ్
  • సెంచరీలో 7 ఫోర్లు, 7 సిక్స్‌లు
  • 15 ఏళ్లు నిండకముందే మూడో సెంచరీ సాధించిన వైభవ్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (ఎస్ఎంఏటీ)లో సంచలన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అత్యంత పిన్న వయస్సులో (14 ఏళ్ల 250 రోజులు) శతకం సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మహారాష్ట్ర, బీహార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ 61 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 108 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

వైభవ్‌కు ఇది తొలి శతకం. పదిహేనేళ్లు నిండకముందే టీ20ల్లో మూడో సెంచరీ సాధించడం విశేషం. అంతకుముందు ఐపీఎల్ 2025, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లోనూ వైభవ్ సెంచరీలు చేశాడు. వైభవ్ సెంచరీతో చెలరేగడంతో బీహార్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

కాగా, అంతకుముందు ఈ రికార్డు విజయ్ జోల్ పేరిట ఉంది. మహారాష్ట్ర తరఫున ఆడిన విజయ్ 2013లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 63 బంతుల్లో సెంచరీ చేశాడు. అప్పుడు విజయ్ వయస్సు 18 ఏళ్ల 118 రోజులు. కర్ణాటక, తమిళనాడు మధ్య జరిగిన మ్యాచ్‌లో దేవదూత్ పడిక్కల్ కూడా సెంచరీ (102) చేశాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025-26లో వైభవ్‌ది పదో సెంచరీ. ఆయుష్ మాత్రే (ముంబై), అభిమన్యు ఈశ్వరన్ (బెంగాల్), ఇషాన్ కిషన్ (ఝార్ఖండ్), కిషన్ లింగోద్ (మేఘాలయ), రోహన్ కుణ్ణుమ్మల్ (కేరళ), దేవదత్ పడిక్కల్ (కర్ణాటక), ప్రియోజిత్ కంగబమ్ (మణిపూర్), అభిషేక్ శర్మ (పంజాబ్), ఉర్విల్ పటేల్ (గుజరాత్), వైభవ్ సూర్యవంశీ (బీహార్) సెంచరీలు సాధించారు.
Vaibhav Suryavanshi
Syed Mushtaq Ali Trophy
SMAT
Bihar Cricket
Maharashtra Cricket

More Telugu News