Samantha Ruth Prabhu: 'బాధితురాలిగా విలన్ బాగా నటించింది'.. స‌మంత‌ మాజీ మేకప్ స్టైలిస్ట్ వివాదాస్పద పోస్టు!

Samanthas Second Marriage Sparks Controversy
  • బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత
  • కోయంబత్తూరు ఈశా యోగా కేంద్రంలో నిరాడంబరంగా పెళ్లి
  • పెళ్లి తర్వాత పూనమ్ కౌర్, మాజీ స్టైలిస్ట్ సద్నా సింగ్ పరోక్ష విమర్శలు
  • వారి పోస్టులు సమంతను ఉద్దేశించేనంటూ సోషల్ మీడియాలో చర్చ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. నిన్న‌ కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో లింగ భైరవి సన్నిధిలో, భూత శుద్ధి పద్ధతిలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే, ఈ శుభవార్తతో పాటు కొన్ని వివాదాలు కూడా మొదలయ్యాయి. కొందరు సెలబ్రిటీలు పెట్టిన పరోక్ష పోస్టులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

నటి పూనమ్ కౌర్ 'ఎక్స్' వేదికగా "సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం" అంటూ చేసిన పోస్ట్ కలకలం రేపారు. ఇది ఎవరిని ఉద్దేశించిందనే స్పష్టత లేనప్పటికీ సమంత పెళ్లి తర్వాత రావడంతో నెటిజన్లు ఆమెనే లక్ష్యంగా చేసుకున్నారని భావిస్తున్నారు. 

ఇదే క్రమంలో సమంత మాజీ పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సద్నా సింగ్ సైతం "బాధితురాలిగా విలన్ బాగా నటించింది" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టడం, ఆ వెంటనే సమంతను అన్‌ఫాలో చేయడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది.

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత సమంత ఈ పెళ్లి చేసుకున్నారు. మరోవైపు రాజ్ నిడిమోరుకు కూడా గతంలో శ్యామలీతో వివాహం జరిగి, పిల్లలు ఉన్నారు. ఆమె నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు సమంతను పెళ్లాడారు. ఈ నేపథ్యంలోనే సమంతపై పరోక్ష విమర్శలు వస్తున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఒకవైపు శుభాకాంక్షలు, మరోవైపు వివాదాల నడుమ సమంత కొత్త జీవితాన్ని ప్రారంభించారు.


Samantha Ruth Prabhu
Samantha marriage
Raj Nidimoru
Poonam Kaur
Sadna Singh
Tollywood
Divorce
Controversy
Esha Yoga Center
Coimbatore

More Telugu News