Donald Trump: ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారట.. ఎంఆర్ఐ స్కాన్ వివరాలు వెల్లడి

Donald Trump in perfect health MRI scan details revealed
  • గుండె పనితీరు భేషుగ్గా ఉందంటున్న వైద్యుడు
  • ఆయన ఆరోగ్యంపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని వెల్లడి
  • ట్రంప్ జ్ఞాపకశక్తి కూడా అద్భుతంగా ఉందని వివరణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం భేషుగ్గా ఉందని వైట్ హౌస్ డాక్టర్ కెప్టెన్ షాన్ బార్బాబెల్లా పేర్కొన్నారు. ఈమేరకు ట్రంప్ ఎంఆర్ఐ స్కానింగ్ వివరాలకు సంబంధించిన నివేదికను విడుదల చేస్తూ బార్బాబెల్లా మీడియాతో మాట్లాడారు. అధ్యక్షుడి ఆరోగ్యంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఎంఆర్ఐ స్కానింగ్ లో ట్రంప్ గుండె పనితీరు బాగుందని తేలినట్లు డాక్టర్ వెల్లడించారు. ఆయన జ్ఞాపకశక్తి కూడా అద్భుతంగా ఉందన్నారు.

ట్రంప్ వయసు ప్రస్తుతం 79 ఏళ్లని, ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ట్రంప్ వయసున్న వ్యక్తుల్లో సాధారణంగా కార్డియోవాస్కులర్ (గుండె), ఉదర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున గత అక్టోబర్‌లో ఆయనకు సమగ్రమైన ఎంఆర్‌ఐ స్కానింగ్ నిర్వహించినట్లు డాక్టర్ బార్బాబెల్లా వెల్లడించారు. ఆ ఫలితాలను తాజాగా విడుదల చేసినట్లు తెలిపారు.
Donald Trump
Trump health
Donald Trump MRI
White House doctor
Sean Barbabella
Trump age
Cardiovascular health
US President

More Telugu News