Chandrababu Naidu: నేడు ఏలూరులో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu Naidu Eluru Visit Today for Pension Distribution
  • ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
  • కిడ్నీ వ్యాధి బాధితురాలికి ఇంటికెళ్లి పింఛన్ అందజేయనున్న సీఎం
  • ప్రజావేదిక వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న చంద్రబాబు
  • డిసెంబర్ నెలకు రూ. 2738 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో, ఆయన నేరుగా లబ్ధిదారుల వద్దకే వెళ్లి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి ఉంగుటూరు మండలం గొల్లగూడెం చేరుకున్నారు.
 
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గోపీనాథపట్నం గ్రామానికి వెళ్లారు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న నాగలక్ష్మి అనే మహిళ ఇంటికి వెళ్లి, ఆమెను పరామర్శించి స్వయంగా పింఛన్ అందజేశారు. అనంతరం నల్లమాడలోని ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత గొల్లగూడెంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు.
 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నెల కోసం ప్రభుత్వం 8,190 కొత్త పింఛన్లను మంజూరు చేసింది. ఈ నెల పింఛన్ల పంపిణీ కోసం మొత్తం రూ. 2738.71 కోట్లను విడుదల చేసింది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Eluru
Pension Distribution
NTR Bharosa
Gollagudem
Unguturu
Kidney Disease
Naga Lakshmi
TDP

More Telugu News