Chiranjeevi: ఈ సంక్రాంతికి డబుల్ బొనాంజా.. చిరు సినిమాపై అనిల్ రావిపూడి ధీమా

Chiranjeevis Film Double Bonanza This Sankranthi Says Anil Ravipudi
  • ఈ సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్‌ గారు'గా రానున్న చిరంజీవి
  • 20 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న మెగాస్టార్
  • గత సంక్రాంతి కంటే డబుల్ బొనాంజా ఉంటుందన్న దర్శకుడు అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌ గారు’. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సంక్రాంతికి డబుల్ బొనాంజా ఉంటుందని, చిరంజీవిని ప్రేక్షకులు ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న పాత్రలో చూస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "చిరంజీవి గారు పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటించి దాదాపు 20 ఏళ్లు దాటింది. ఇది ఆయనకు ఎంతో నచ్చిన జానర్. గతంలో ఇలాంటి కథలతో ఆయన ఎన్ని బ్లాక్‌బస్టర్లు సాధించారో మనందరికీ తెలుసు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే జానర్‌తో వస్తున్నారు. ఈ సినిమాతో చిరంజీవి గారు అందరినీ సర్‌ప్రైజ్‌ చేయడం ఖాయం" అని తెలిపారు.

ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ పాటకు అద్భుతమైన స్పందన వచ్చిందని, త్వరలోనే మరో పాటను విడుదల చేస్తామని చెప్పారు. షూటింగ్ పూర్తి కాగానే ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తామని అనిల్ రావిపూడి వివరించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటుడు వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించనుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
Chiranjeevi
Mana Shankara Varaprasad Garu
Anil Ravipudi
Nayanthara
Venkatesh
Telugu Movie
Sankranthi Release
Family Entertainer
Meesala Pilla Song
Tollywood

More Telugu News