టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 60 రోజుల ముందే టికెట్ బుకింగ్!
- పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు వెసులుబాటు
- ఇప్పటికే ఉన్న సదుపాయంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్ణయం
- ఏసీ, స్లీపర్ బస్సులను పెంచుతున్న ఆర్టీసీ
వాస్తవానికి ఈ 60 రోజుల ముందస్తు బుకింగ్ సదుపాయం గతంలోనూ అందుబాటులో ఉంది. అయితే దీనిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో, పండుగల సీజన్ నేపథ్యంలో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఇటీవలి కాలంలో టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 'గమ్యం' యాప్ ద్వారా బస్సుల లైవ్ లొకేషన్ తెలుసుకునే సదుపాయం కల్పించింది. అంతేకాకుండా, పలు ప్రధాన రూట్లలో ఏసీ, సీటర్, స్లీపర్ వంటి కొత్త సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణం తరహాలోనే బస్సు బయలుదేరే సమయం, స్టాపుల వివరాలు వంటి సమాచారాన్ని ముందుగానే అందిస్తూ ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది.