Nagarkurnool Medical College: నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

Nagarkurnool Medical College Ragging Incident Sparks Outrage
  • జూనియర్ విద్యార్థినులను వేధించిన నలుగురు సీనియర్లు
  • గోడకుర్చీ వేయించి సెల్యూట్ చేయాలంటూ ఇబ్బందులు
  • నలుగురు విద్యార్థులను ఏడాదిపాటు హాస్టల్ నుంచి బహిష్కరించిన ప్రిన్సిపాల్
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటన మరోసారి కలకలం రేపింది. జూనియర్ విద్యార్థినులను వేధించిన నలుగురు సీనియర్ విద్యార్థులపై కళాశాల యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. వారిని ఏడాది పాటు హాస్టల్ నుంచి బహిష్కరిస్తూ ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల 6వ తేదీన ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నలుగురు సీనియర్ విద్యార్థులు క్యాంపస్‌లో జూనియర్ విద్యార్థినులను తీవ్రంగా వేధించారు. తరగతి గదుల్లోకి వెళ్లే ముందు వారిని గోడకుర్చీ వేయించి, తమకు సెల్యూట్ చేయాలంటూ ఇబ్బందులకు గురిచేశారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత విద్యార్థినులు ప్రిన్సిపాల్ రమాదేవికి ఫిర్యాదు చేశారు.

తక్షణమే స్పందించిన ప్రిన్సిపాల్ ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థులను ఏడాది పాటు హాస్టల్ నుంచి బహిష్కరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి ఇలాంటివి జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు. కళాశాల యాజమాన్యం తీసుకున్న తక్షణ చర్యలతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Nagarkurnool Medical College
Nagarkurnool
Medical College Ragging
Ragging Case
Telangana
Student Harassment
Rama Devi Principal
Hostel Expulsion
Junior Students

More Telugu News