Puli Venkateswarlu: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఎస్సై ఉద్యోగానికి రాజీనామా

Puli Venkateswarlu Resigns SI Job to Contest Sarpanch Election
  • మరో ఐదు నెలల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా ముందే రాజీనామా
  • కోదాడలో ఎస్సైగా పని చేస్తున్న పులి వెంకటేశ్వర్లు
  • తన స్వగ్రామం గుడిబండలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లాలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక ఎస్సై స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ కాలం మరో ఐదు నెలలు ఉండగానే ఎన్నికలు రావడంతో, స్వగ్రామంలో పోటీ చేయాలనే ఆకాంక్షతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

కోదాడలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న పులి వెంకటేశ్వర్లు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కోదాడ మండలం పరిధిలోని ఆయన స్వగ్రామం గుడిబండలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

రాజకీయ పదవుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు తమ అవకాశాలను బట్టి రాజీనామాలు చేయడం సాధారణంగా చూస్తుంటాం. ఎంతోమంది ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారులు సైతం తమ పదవులకు రాజీనామా చేసి, తమకు నచ్చిన రాజకీయ పార్టీలలో చేరి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు లేదా నామినేటెడ్ పదవులు పొందుతున్నారు. మరికొందరు ఉద్యోగ విరమణ అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు.
Puli Venkateswarlu
Telangana elections
Sarpanch election
Gudibanda village
Kodada

More Telugu News