I-Bomma Ravi: ఐ-బొమ్మ, బప్పం పేర్లు ఎందుకు పెట్టాడో చెప్పిన ఐబొమ్మ రవి!

IBomma Ravi Reveals Why He Named Piracy Sites IBomma and Baddam
  • ముగిసిన ఐ-బొమ్మ రవి రెండో విడత కస్టడీ
  • ఐ-బొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మ అని వెల్లడి
  • సాంకేతిక సమస్య కారణంగా బలపం పేరునే బప్పంగా పెట్టినట్లు వెల్లడి
పైరసీ వెబ్‌సైట్లు 'ఐబొమ్మ', 'బప్పం'ల పేర్లు ఎందుకు పెట్టారనే విషయాన్ని ఐ-బొమ్మ రవి విచారణలో వెల్లడించాడు. ఐ-బొమ్మ రవిని అరెస్టు చేసిన పోలీసులు మొదట ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి అతడిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం అంగీకరించింది. అతడి రెండో విడత కస్టడీ నేటితో ముగిసింది.

పోలీసుల విచారణలో అతడు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఐ-బొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మ అని తెలిపాడు. విశాఖలో సినిమాను బొమ్మ అని పిలిచేవారని అందుకే ఆ పేరు పెట్టినట్లు చెప్పాడు. మరో పైరసీ వెబ్‌సైట్‌కు బలపం అని పేరు పెట్టాలనుకున్నప్పటికీ, డొమైన్‌లో సాంకేతిక సమస్య కారణంగా 'ఎల్' అక్షరాన్ని తొలగించి 'బప్పం'గా మార్చినట్లు వెల్లడించాడు.

ఐ-బొమ్మ రవి రెండో విడత కస్టడీ ఈరోజుతో ముగిసింది. ఇందులో భాగంగా పోలీసులు అతడిని మూడు రోజుల పాటు ప్రశ్నించి, కీలక విషయాలను రాబట్టారు. పైరసీకి సంబంధించిన అడ్వాన్స్‌డ్ సాంకేతికత గురించి పోలీసులకు రవి వివరించాడు. తాను అప్‌లోడ్ చేసిన సినిమాలు టెలిగ్రామ్ నుండి తీసుకున్నవేనని చెప్పాడు. కస్టడీ ముగియడంతో పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు.
I-Bomma Ravi
I-Bomma
Baddam
piracy website
internet Bomma
Visakha
Telugu movies

More Telugu News