Varanasi Movie: మహేశ్‌-రాజమౌళి సినిమాకు టైటిల్ చిక్కులు.. పేరు మార్పు?

Mahesh Babu Rajamouli film title troubles Varanasi name change
  • 'వారణాసి' టైటిల్‌ను మరొకరు రిజిస్టర్ చేసుకోవడంతో సమస్య
  • తెలుగులో 'రాజమౌళి వారణాసి' పేరుతో విడుదల చేసే అవకాశం
  • గతంలో స‌మహేశ్‌ ఖలేజా', 'శేఖర్ కమ్ముల కుబేర'గా మారిన టైటిల్స్
సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, ప్ర‌ముఖ‌ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రంపై ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ఇటీవ‌ల మేక‌ర్స్‌ ‘వారణాసి’ అనే పేరును ఖరారు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో ఓ చిన్న చిక్కు వచ్చిపడినట్లు, దానికి పరిష్కారంగా తెలుగులో పేరు మార్చనున్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే... ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఇప్పటికే తెలుగులో మరో నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేయించింది. రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్‌పై సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో ఇదే పేరుతో ఓ చిన్న సినిమాను గతంలోనే ప్రకటించారు. దీంతో రాజమౌళి సినిమాకు తెలుగులో ఇదే టైటిల్ వాడటంపై సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఓ కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తెలుగు వెర్షన్‌కు 'రాజమౌళి వారణాసి' అనే టైటిల్‌తో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇతర భారతీయ, అంతర్జాతీయ భాషల్లో మాత్రం యథావిధిగా ‘వారణాసి’ పేరుతోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇలాంటి టైటిల్ వివాదాలు రావడం కొత్తేమీ కాదు. గతంలో మహేశ్‌ బాబు 'ఖలేజా' సినిమా టైటిల్‌పై వివాదం రావడంతో దాన్ని ‘మహేశ్‌ ఖలేజా’గా మార్చారు. ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రానికి కూడా ‘కుబేర’ టైటిల్‌పై సమస్య తలెత్తడంతో ‘శేఖర్ కమ్ముల కుబేర’గా విడుదల చేశారు. ఇప్పుడు అదే తరహాలో రాజమౌళి సినిమా టైటిల్‌ను కూడా మార్చనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇందులో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో మహేశ్‌ బాబు రుద్ర పాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ప్రియాంకా చోప్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2027లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Varanasi Movie
Mahesh Babu
Rajamouli
Varanasi movie title
SS Rajamouli movie
Telugu cinema title issue
Prithviraj Sukumaran
Priyanka Chopra
Mahesh Babu Rudra
Ramabhakta Hanuma Creations

More Telugu News