Narella Jyothi: సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన మాజీ మావోయిస్టు నేత జ్యోతి

Narella Jyothi Former Maoist Leader Contests Sarpanch Election
  • రాజన్న సిరిసిల్ల జిల్లా శివంగలపల్లి నుంచి పోటీ
  • 19 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేసిన నేపథ్యం
  • ప్రజాసేవ కోసమే ఎన్నికల్లో నిలబడ్డానని వెల్లడి
తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మాజీ మావోయిస్టు నాయకురాలు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. సుమారు 19 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నేరెళ్ల జ్యోతి, ఇప్పుడు తన సొంతూరి నుంచే సర్పంచ్‌గా బరిలోకి దిగారు.

వివరాల్లోకి వెళ్తే, కోనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల జ్యోతి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 2005లో దళ సభ్యురాలిగా చేరిన జ్యోతి, అనతికాలంలోనే జిల్లా కమిటీ సభ్యురాలి స్థాయికి, రాష్ట్ర ప్రెస్ ఇన్‌చార్జిగానూ బాధ్యతలు చేపట్టారు. అయితే, అనారోగ్య కారణాల వల్ల 2023లో ఆమె కరీంనగర్ ఎస్పీ ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు.

ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో శివంగలపల్లి సర్పంచ్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు. దీంతో తనకు ప్రజాసేవ చేసే అవకాశం లభించిందని భావించిన జ్యోతి, ఎన్నికల బరిలో నిలిచేందుకు నిర్ణయించుకున్నారు. మావోయిస్టుగా ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపైనే పోరాడానని, ఇప్పుడు సర్పంచ్‌గా గెలిచి గ్రామ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే పోటీ చేస్తున్నానని ఆమె తెలిపారు.
Narella Jyothi
Telangana Panchayat Elections
Rajanna Sirisilla
Maoist Leader
Shivangulapally
Konaraopeta Mandal
BC Woman
Surrender
Sarpanch Election
Public Service

More Telugu News