Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన శుభలేఖ సుధాకర్

Revanth Reddy Meets Shubhalekha Sudhakar
  • ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం
  • రవీంద్ర భారతి ఆవరణలో విగ్రహావిష్కరణ
  • విగ్రహ ఏర్పాటుకు అనుమతించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సుధాకర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15న రవీంద్ర భారతి ఆవరణలో దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. రవీంద్ర భారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటుకు అనుమతించినందుకు ఎస్పీ బాలు కుటుంబం తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడి శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అంతేకాకుండా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించారు. సినిమాల్లోనే కాకుండా టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ, గాయకులను వెలుగులోకి తెచ్చారు. ఆయన 2020 సెప్టెంబర్ 25న కన్నుమూశారు.
Revanth Reddy
Shubhalekha Sudhakar
SP Balasubrahmanyam
SPB statue

More Telugu News