పెళ్లి రద్దుపై ఊహాగానాల వేళ ఒకే పోస్టు పెట్టిన స్మృతి, పలాశ్
- ఈ నెల 23న జరగాల్సిన వివాహం రద్దు
- స్మృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యమే కారణమని ఇరు కుటుంబాల వెల్లడి
- కోలుకుని ఇంటికి చేరుకున్నా పెళ్లిమాటెత్తని మంధాన ఫ్యామిలీ
ఆమెతో పాటు మిగతా క్రికెటర్లు కూడా తమ సోషల్ మీడియా ఖాతాలలో నుంచి ఈ వీడియోలను తొలగించారు. దీంతో స్మృతి మంధాన, పలాశ్ ల వివాహంపై సందేహాలకు తావిచ్చింది. అయితే, తాజాగా స్మృతి మంధాన, పలాశ్ లు ఇన్ స్టా వేదికగా ఒకేరకమైన పోస్టు పెట్టడంపై చర్చ జరుగుతోంది. వివాహంపై సందేహాలు నెలకొన్న వేళ ఇరువురూ నజర్ ఎమోజీని పంచుకోవడం గమనార్హం. సాధారణంగా ఏదైనా శుభకార్యానికి సంబంధించిన సమాచారం పంచుకునేటపుడు దిష్టి తగలకుండా ఈ ఎమోజీని ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో స్మృతి, పలాశ్ లు ఈ ఎమోజీని పోస్ట్ చేయడంతో తమ వివాహానికి దిష్టి తగిలిందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్మృతి, పలాశ్ లు పెట్టిన ఈ పోస్టుతో వారి వివాహానికి సంబంధించి అభిమానుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. త్వరలో వారిద్దరూ ఒక్కటవుతారని ఆశిస్తున్నారు.