Kajol: వివరణ ఇచ్చినా కాజోల్ ను వదలని నెటిజన్లు... విమర్శల వెల్లువ

Kajol Faces Criticism After Marriage Remarks Spark Controversy
  • పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలంటూ కాజోల్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • సోషల్ మీడియాలో నటిపై వెల్లువెత్తిన విమర్శలు
  • సరదాగా చేసిన వ్యాఖ్యలంటూ వివరణ ఇచ్చిన కాజోల్, ట్వింకిల్
  • వారి వివరణను అంగీకరించని నెటిజన్లు, కొనసాగుతున్న ట్రోలింగ్
బాలీవుడ్ నటి కాజోల్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ టాక్ షోలో ఆమె పెళ్లి బంధంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉండాలని, అవసరమైతే రెన్యూవల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

వివరాల్లోకి వెళ్తే, ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ కోసం కాజోల్, ట్వింకిల్ ఖన్నా కలిసి ఓ చర్చా కార్యక్రమానికి హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్‌కు నటులు విక్కీ కౌశల్, కృతి సనన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాజోల్.. "నచ్చని వారితో బలవంతంగా జీవించడం ఎందుకు? పెళ్లికి కూడా గడువు తేదీ ఉండాలి కదా" అని వ్యాఖ్యానించారు. దీనికి ట్వింకిల్ మద్దతు పలకగా, విక్కీ, కృతి మాత్రం ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు.

ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు కాజోల్, ట్వింకిల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వివాహ బంధం విలువను తగ్గించేలా మాట్లాడటం సరికాదని, బాధ్యతగల స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజంపై చెడు ప్రభావం చూపుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

విమర్శలు పెరగడంతో కాజోల్, ట్వింకిల్ స్పందించారు. షోలో సరదాగా జరిగిన సంభాషణను సీరియస్‌గా తీసుకోవద్దని కాజోల్ కోరారు. ఇది కేవలం హాస్యం కోసమేనని, మొదటి ఎపిసోడ్ నుంచే డిస్క్లైమర్ ఇస్తున్నామని ట్వింకిల్ వివరణ ఇచ్చారు. అయితే, వారి వివరణను కూడా నెటిజన్లు అంగీకరించడం లేదు. ముందు మాట్లాడి, తర్వాత సరదా అనడం సరికాదని, పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లపై మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలని హితవు పలుకుతున్నారు.
Kajol
Kajol controversy
Twinkle Khanna
Bollywood actress
marriage expiry date
Vicky Kaushal
Kriti Sanon
OTT platform
social media criticism
marriage values

More Telugu News