Kavitha: రైలు పట్టాలపై బైఠాయించిన కవిత.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Kavitha Detained by Police During Rail Roko Protest
  • కామారెడ్డిలో రైలు రోకో చేపట్టిన కవిత
  • కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట
  • తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డిలో రైలు రోకో చేపట్టిన కవితను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కవిత, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రైలు రోకో చేపట్టారు. కార్యకర్తలతో కలిసి కవిత రైల్వే పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో కవితకు స్వల్ప గాయాలయ్యాయి.
Kavitha
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
Kamareddy
Rail Roko
BC Reservations
Telangana Politics

More Telugu News