Hong Kong Fire: హాంకాంగ్ అగ్నిప్రమాదం... 24 గంటల తర్వాత 16వ అంతస్తు నుంచి వ్యక్తిని రక్షించిన సిబ్బంది
- హాంగ్‌కాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం, 65కి పెరిగిన మృతుల సంఖ్య
- నిర్మాణ పనుల్లో వాడిన ఫోమ్ బోర్డుల వల్లే ప్రమాద తీవ్రత
- నిర్లక్ష్యం ఆరోపణలపై ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
హాంగ్‌కాంగ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. వాంగ్ ఫుక్ కోర్టు రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటల్లో మృతుల సంఖ్య 65కి చేరింది. మృతుల్లో ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. మరో 70 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ పెను విషాదం మధ్య ఓ అద్భుతం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన 24 గంటల తర్వాత ఒక వ్యక్తిని సహాయక సిబ్బంది ప్రాణాలతో కాపాడారు.
గురువారం మధ్యాహ్నం 32 అంతస్తుల ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన వెదురు పరంజాలు, ప్రతి అంతస్తులో అమర్చిన అత్యంత సులభంగా మండే ఫోమ్ బోర్డుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. దీన్ని అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యంగా పరిగణిస్తున్నారు. గత 50 ఏళ్లలో హాంగ్‌కాంగ్‌లో ఇదే అత్యంత తీవ్రమైన భవన ప్రమాదం కావడం గమనార్హం.
సుమారు 1,200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భవనం కూలిపోతుందనే భయం, తీవ్రమైన వేడి, కూలిపోయిన పరంజాలు వంటి సవాళ్ల మధ్య వారు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం 16వ అంతస్తులో చిక్కుకుపోయిన వ్యక్తిని 24 గంటల తర్వాత ప్రాణాలతో బయటకు తీశారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. ఇంకా 24 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
చాలా మంది నివాసితులు తమ ఫ్లాట్లలో అలారమ్‌లు మోగలేదని, మంటలను చూశాకే బయటకు పరుగులు తీశామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నిర్మాణ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు, ఒక కన్సల్టెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రమాద కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.