Rahul Sipligunj: ఓ ఇంటివాడైన రాహుల్ సిప్లిగంజ్.. ప్రియురాలు హరిణ్య మెడలో మూడుముళ్లు.. వీడియో ఇదిగో!
- హైదరాబాద్ లో ఘనంగా జరిగిన వివాహ వేడుక
- పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోలు
ప్రముఖ గాయకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు హరిణ్య మెడలో మూడుముళ్లు వేశారు. గురువారం తెల్లవారు జామున కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్. కాలభైరవతో కలిసి పాడారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో రాహుల్ సిప్లిగంజ్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. పాతబస్తీ నుంచి ఆస్కార్ వరకూ వెళ్లిన కుర్రాడని రాహుల్ సిప్లిగంజ్ ను కొనియాడారు.