iBomma Ravi: ఐ-బొమ్మ కేసులో కీలక మలుపు.. నిర్వాహకుడు రవి మళ్లీ కస్టడీకి!

Imandi Ravi Taken into Custody Again in IBomma Case
  • ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి మరోసారి పోలీసుల కస్టడీకి
  • నేటి నుంచి మూడు రోజుల పాటు విచారించనున్న సైబర్ క్రైమ్ పోలీసులు
  • బ్యాంకు ఖాతాలు, నెట్‌వర్క్‌పై మరింత సమాచారం రాబట్టడమే లక్ష్యం
  • ఇటీవల ఐదు రోజుల పాటు విచారించిన అధికారులు
పైరసీ వెబ్‌సైట్ 'ఐ-బొమ్మ' కేసులో ప్రధాన నిందితుడైన ఇమంది రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు అతడిని విచారించనున్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు, ముఖ్యంగా అతడి బ్యాంకు ఖాతాలు, నెట్‌వర్క్‌కు సంబంధించిన పూర్తి సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల ఐ-బొమ్మ కేసులో రవిని అరెస్టు చేసిన పోలీసులు, కోర్టు అనుమతితో ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఆ సమయంలో కొన్ని కీలక ఆధారాలను సేకరించినప్పటికీ, అతడి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు లభ్యం కాలేదని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి కస్టడీకి అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించారు.

పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం, మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న రవిని సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విచారణలో అతడి నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించి ఉంది, ఆర్థిక మూలాల‌పై పోలీసులు దృష్టి సారించనున్నారు.
iBomma Ravi
Imandi Ravi
I-Bomma
I Bomma
piracy website
cyber crime
Hyderabad cyber crime police
bank accounts
financial transactions
Chanchalguda Jail
movie piracy

More Telugu News