Diabetes Temple: ఈ ఆలయాన్ని సందర్శిస్తే షుగర్ తగ్గుతుందట.. ఎక్కడుందంటే!

Diabetes Temple Tamil Nadu temple believed to cure diabetes
  • తమిళనాడులో డయాబెటిస్ టెంపుల్..
  • ఆలయంలో స్వామిని దర్శించుకుంటే షుగర్ వ్యాధి తగ్గుతుందని భక్తుల విశ్వాసం
  • ఆలయ ప్రాంగణంలో చీమలకు చక్కెర నివేదించడం ఆనవాయితీ
షుగర్.. ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందేనని వైద్యులు చెబుతుంటారు. దీనినే మధుమేహం, డయాబెటిస్ అని కూడా అంటారు. డయాబెటిస్ బాధితులు ఎప్పటికప్పుడు మధుమేహ స్థాయులను చెక్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి మాత్రలు వేసుకోవాలని సూచిస్తుంటారు. అయితే, తమిళనాడులోని ఓ ఆలయాన్ని సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకుంటే షుగర్ తగ్గుతుందని ప్రచారం జరుగుతోంది. అక్కడికి వెళ్లి వచ్చాక షుగర్ తగ్గిపోయిందని పలువురు భక్తులు చెబుతున్నారు. దీంతో ఈ ఆలయానికి ‘డయాబెటిస్ టెంపుల్’ అని పేరొచ్చింది. శాస్త్రీయంగా నిరూపణ కాకపోయినా భక్తుల్లో మాత్రం విశ్వాసం మెండుగా ఉంది.
 
తమిళనాడులోని తిరువారూర్ జిల్లా కోయిల్వెన్నిలో ఈ పురాతన దేవాలయం ఉంది. దాదాపు 1300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కరుంబేశ్వరర్ ఆలయానికి ప్రస్తుతం షుగర్ బాధితులు పోటెత్తుతున్నారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న పరమేశ్వరుడిని దర్శించుకుని వెళుతున్నారు. ఆలయంలో శివలింగం మిగతా ఆలయాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. చెరుకు కాండాల సమూహాన్ని కలిపి కట్టినట్లు కనిపిస్తుంది. దీనిని స్థానికులు కరుంబేశ్వరర్ లింగం అని పిలుస్తారు. గర్భగుడిలో కరుంబేశ్వరర్ లింగాన్ని దర్శించుకున్నాక భక్తులు ఆలయ ప్రాంగణంలో చీమలకు చక్కెరను ప్రసాదంగా పెడతారు. దీనివల్ల తమ శరీరంలోని మధుమేహ వ్యాధి తగ్గుతుందని భక్తులు నమ్ముతారు.
Diabetes Temple
Tamil Nadu
Karumbeswarar Temple
Koilvenni
Sugar disease
Diabetes treatment
Karumbeswarar
Hindu temples
Tiruvarur district

More Telugu News