Vinay Rajkumar: ఓటీటీలో కన్నడ రొమాంటిక్ లవ్ స్టోరీ!

Andondittu Kaala Movie Update
  • వినయ్ రాజ్ కుమార్ హీరోగా లవ్ స్టోరీ 
  • ఆగస్టులో థియేటర్స్ కి వచ్చిన సినిమా
  • యూత్ ను ఆకట్టుకున్న కంటెంట్  
  • రీసెంటుగా అమెజాన్ ప్రైమ్ లోకి
  • తెలుగులోను పలకరించే ఛాన్స్

కన్నడలో వినయ్ రాజ్ కుమార్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ఆడియన్స్ కి ఏ మాత్రం రొటీన్ గా అనిపించకుండా ఎప్పటికప్పుడు జోనర్స్ ను మారుస్తూ కొత్తదనం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన మరో సినిమానే 'అందోండిట్టు కాలా'. ఆగస్టు 29వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, యూత్ నుంచి మంచి రెస్పాన్స్ ను చూసింది. 

అలాంటి ఈ సినిమా రీసెంటుగా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'కి వచ్చింది. వినయ్ రాజ్ కుమార్ జోడిగా అదితి ప్రభుదేవా అలరించింది. కీర్తి కన్నప్ప దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. 1990లలో నడిచే ఈ కథకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. థియేటర్స్ నుంచి కంటే కూడా ఓటీటీ వైపు నుంచి మంచి మార్కులు కొట్టేస్తుందని అంటున్నారు. హీరో - హీరోయిన్స్ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని చెబుతున్నారు.  

 రొమాంటిక్ లవ్ స్టోరీస్ ఎక్కువగా యూత్ పై ఆధారపడి నడుస్తాయనేది అందరికీ తెలిసిందే.  ఈ తరహా కథల్లో ఫీల్ ను పేక్షకులు ఎక్కువగా కోరుకుంటారు. ఫొటోగ్రఫీ .. సంగీతం కూడా ఈ తరహా కథలకు మరింత ప్రాణం పోస్తూ ఉంటాయి. రాఘవేంద్ర సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, నిషా కృష్ణన్ .. అరుణ్ బాలాజీ .. గోవిందే గౌడ .. జగ్గప్ప .. ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తారు. తెలుగు ఆడియో కోసం వెయిట్ చేసే ఆడియన్స్ కూడా ఎక్కవగానే ఉన్నారు. త్వరలో తెలుగులోను అందుబాటులోకి వస్తుందేమో చూడాలి మరి.

Vinay Rajkumar
Andondittu Kaala
Aditi Prabhudeva
Kannada movie
romantic love story
Amazon Prime Video
OTT release
Keerthi Kannappa
Kannada cinema
youth audience

More Telugu News