Comic book auction: వేలంలో రూ.81 కోట్లు పలికిన పాత కామిక్ పుస్తకం

Rare Superman Comic Book Makes Brothers Millionaires
  • పాత ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన సూపర్ మ్యాన్ పుస్తకం
  • అరుదైన పుస్తకం కావడంతో వేలం వేసిన టెక్సాస్ సంస్థ
  • రికార్డు స్థాయిలో 9.12 మిలియన్ డాలర్లకు అమ్మకం
వారసత్వంగా వచ్చిన ఇంటిని శుభ్రం చేస్తుండగా దొరికిన ఓ పాత పుస్తకం ముగ్గురు యువకులను రాత్రికిరాత్రే కోటీశ్వరులను చేసింది. కామిక్ పుస్తకాల వేలంలో రికార్డు స్థాయిలో భారీ ధరకు అమ్ముడుపోయింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ మహిళ ఇటీవల కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కుమారులు. ఇటీవల వారు ముగ్గురూ తల్లి పేరు మీద ఉన్న ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇంట్లోని సామాన్లను తొలగించి శుభ్రం చేస్తుండగా పాతకాలం నాటి సూపర్ మ్యాన్ కామిక్ పుస్తకం దొరికింది. అప్పట్లో ఈ పుస్తకానికి చాలా క్రేజ్ ఉండేదని తెలుసుకున్న ముగ్గురు సోదరులూ దానిని వేలం వేయాలని భావించారు.

ఇందుకోసం టెక్సాస్ లోని ఓ వేలం సంస్థను ఆశ్రయించారు. ఈ నెల మొదట్లో ఈ కామిక్ పుస్తకాన్ని వేలం వేయగా.. ఏకంగా 9.12 మిలియన్ డాలర్లకు (మన రూపాయల్లో సుమారు 81.25 కోట్లు) అమ్ముడుపోయింది. ఓ కామిక్ పుస్తకానికి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి అని సదరు వేలం నిర్వహించే సంస్థ పేర్కొంది. దీంతో ఆ ముగ్గురు సోదరులు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.
Comic book auction
Superman
Superman comic book
Heritage Auctions
San Francisco
Million dollar comic book
Rare comic books
Comic book value
Record comic book sale
Action Comics #1

More Telugu News