India Cricket Team: రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం.. దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్​

India loses Second Test Match to South Africa by 408 Runs
  • భారీ టార్గెట్ ఛేదనలో 140 పరుగుల వద్ద కుప్పకూలిన భారత్
  • 408 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం
  • 2–0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా జట్టు
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఘోర ఓటమి పాలైంది. గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ ను ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా 140 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా చేసిన 54 పరుగులే అత్యధికం. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో 140 పరుగుల వద్ద భారత్ కుప్పకూలింది. దీంతో 408 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది.

ఈ విజయంతో 2‌‌–0 తేడాతో టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ వైట్‌వాష్‌ కు గురైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్‌ 6 వికెట్లు, కేశవ్ మహారాజ్‌ 2 వికెట్లు పడగొట్టారు. ముత్తుస్వామి, మార్కో యాన్సన్‌ చెరో వికెట్‌ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 489 రన్స్ చేయగా, భారత్‌ 201 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 260/5 వద్ద డిక్లేర్ చేసింది.
India Cricket Team
India vs South Africa
South Africa Cricket
Test Series
Cricket Match
Ravindra Jadeja
Keshav Maharaj
Harmer
Cricket
White Wash

More Telugu News