Bandla Ganesh: ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నాది కాదు.. త్వరలో వస్తా: బండ్ల గణేశ్‌

Bandla Ganesh Clarifies Fake Instagram Account Details
  • తన పేరుతో నడుస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫేక్ అని వెల్లడి
  • త్వరలోనే అధికారికంగా ఇన్‌స్టాలోకి వస్తానని ప్రకటన
  • ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్క్రీన్‌షాట్‌తో క్లారిటీ ఇచ్చిన నిర్మాత
తన మాటలతో, చేతలతో నిత్యం వార్తల్లో నిలిచే ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌ సోషల్ మీడియా వేదికగా మరోసారి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం తన పేరు మీద చలామణిలో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తనది కాదని, అది నకిలీదని స్పష్టం చేశారు. త్వరలోనే తాను అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశిస్తానని, అప్పుడు అసలు ఖాతా వివరాలను వెల్లడిస్తానని తెలిపారు.

ఈ మేరకు ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. “నా పేరు మీద ఎవరో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ రన్ చేస్తున్నారు. అది అధికారికం కాదు. దయచేసి ఎవరూ నమ్మవద్దు. త్వరలోనే నేను అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంటర్ అవుతాను” అని పేర్కొంటూ, ఫేక్ అకౌంట్ స్క్రీన్‌షాట్‌ను జతచేశారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వగా, అభిమానులు ఆయన ఇన్‌స్టా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగిన బండ్ల గణేశ్‌, తన స్పీచ్‌లతో ప్రత్యేక గుర్తింపు పొందారు. కొంతకాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్న ఆయన, ఇటీవల దీపావళి సందర్భంగా రూ.2 కోట్లతో భారీ పార్టీ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు హాజరైన ఈ పార్టీ, ఆయన రీఎంట్రీకి సంకేతమనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే నిర్మాత ఎస్‌కే‌ఎన్ ఒక కార్యక్రమంలో "బండ్ల గణేశ్‌ సినిమాలు తీయకపోవడం ఇండస్ట్రీకి ప్రమాదం" అని వ్యాఖ్యానించడం ఆసక్తిని రేకెత్తించింది. విజయ్ దేవరకొండ, కిరణ్ అబ్బవరం వంటి హీరోలతో బండ్ల గణేశ్‌ సినిమాలు చేయబోతున్నారని వార్తలు వస్తున్నప్పటికీ, వాటిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Bandla Ganesh
Bandla Ganesh Instagram
Producer Bandla Ganesh
Telugu Cinema
Fake Instagram account
SKN producer
Vijay Deverakonda
Kiran Abbavaram
Chiranjeevi
Telugu film industry

More Telugu News