Delhi Pollution: ఇంటి నుంచే పని చేయండి.. ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం

Delhi Government Orders Work From Home Due to Pollution
  • ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే హాజరు
  • ఢిల్లీలో తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం.. పడిపోయిన ఏక్యూఐ
  • ప్రైవేటు ఆఫీసుల్లోనూ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేయించాలని ఆదేశాలు
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) 300 పైగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందికి హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రతిరోజూ 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు రావాలని, మిగిలిన సిబ్బంది ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు చర్యలు చేపట్టాలని సంబంధిత ప్రభుత్వ విభాగాల అధిపతులను ఆదేశించింది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బంది హాజరును తగ్గించాలని సూచించింది. అత్యవసర సిబ్బంది మినహా మిగిలిన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ప్రైవేటు కంపెనీలను ఆదేశించింది. ఎన్విరాన్ మెంట్ (ప్రొటెక్షన్) యాక్ట్ 1986 లోని సెక్షన్ 5 ప్రకారం పర్యావరణ శాఖ సోమవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.
Delhi Pollution
Delhi AQI
Air Quality Index
Work From Home
Government Order
NCR
Environment Protection Act 1986
Delhi Government

More Telugu News