Chevireddy Bhaskar Reddy: అనారోగ్యంతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలింపు

Chevireddy Bhaskar Reddy Ill Transferred to AIIMS Hospital
  • మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
  • అనారోగ్యం కారణంగా విజయవాడ జైలు నుంచి ఎయిమ్స్‌కు తరలింపు
  • రెండు రోజులుగా కాళ్ల వాపులతో బాధపడుతున్నట్లు వెల్లడి
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయన్ను మెరుగైన చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఆయన ఏ38గా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

వివరాల్లోకి వెళ్తే, గత రెండు రోజులుగా తన కాళ్లకు వాపు వస్తోందని, వెరికోస్‌ వెయిన్స్‌ సమస్యతో బాధపడుతున్నానని చెవిరెడ్డి జైలు అధికారులకు తెలిపారు. వాస్కులర్‌ సర్జన్‌కు చూపించాలని ఆయన కోరడంతో, అధికారులు సోమవారం ఆయన్ను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు, మెరుగైన చికిత్స అవసరమని నిర్ధారించి ఎయిమ్స్‌కు రిఫర్‌ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎయిమ్స్‌ అధికారులకు లేఖ రాశారు. ‌అక్కడి నుంచి అధికారికంగా అనుమతి రావడంతో, మంగళవారం ఉదయం చెవిరెడ్డిని విజయవాడ జైలు నుంచి ప్రత్యేక భద్రత మధ్య మంగళగిరి ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Chevireddy Bhaskar Reddy
Chevireddy
Vijayawada Jail
AIIMS Mangalagiri
Liquor Scam Case
YSRCP Leader
Andhra Pradesh Politics
Health Issues
Varicose Veins
Medical Treatment

More Telugu News