Hazeera Begum: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కూతురును చంపిన తల్లి.. యావజ్జీవ కారాగారం శిక్ష

Hazeera Begum Mother kills daughter for affair gets life sentence
  • వరంగల్ జిల్లాలో 2022లో మూడేళ్ల కూతురును చంపిన తల్లి, ప్రియుడు
  • చిన్నారి రెండు చేతులను పట్టుకుని గాల్లో గిరగిరా తిప్పి నేలకేసి కొట్టిన ప్రియుడు
  • చిన్నారి నోరుమూసి గొంతు నులిమి హత్య చేసిన తల్లి
తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలో మూడేళ్ల క్రితం జరిగిన  ారుణ హత్య కేసులో వరంగల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి వీ.బీ. నిర్మలా గీతాంబ ఇద్దరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఒక తల్లి తన ప్రియుడితో కలిసి సొంత కూతురిని హతమార్చింది.

హైదరాబాద్ చార్మినార్ ప్రాంతానికి చెందిన సయ్యద్ యూసఫ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, సయ్యద్ యూసఫ్ పట్టించుకోకపోవడంతో ఆయన భార్య పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. అదే ప్రాంతంలో ఉంటున్న సయ్యదా హజీరా బేగం తన భర్త ఇంతియాజ్ అలీ, మూడేళ్ల కూతురు ఫాతిమా సబాతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో యూసఫ్, హజీరా బేగం మధ్య పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది.

కొంతకాలానికి వీరిద్దరూ హైదరాబాద్ నుంచి వరంగల్‌లోని రంగశాయిపేటకు చేరుకున్నారు. అక్కడ పాతసామాను వ్యాపారి ఖాసీం వద్ద పనికి కుదిరారు. పాత సామాను దుకాణం ప్రాంగణంలోనే నివాసం ఉంటూ, కొన్నాళ్లకు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, కూతురు ఫాతిమా సబాను హతమారిస్తేనే పెళ్లి చేసుకుంటానని యూనస్ చెప్పడంతో హజీరా అంగీకరించింది.

ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్ 23న యూనస్ నిద్రిస్తున్న చిన్నారి ఫాతిమా సబా రెండు చేతులను గట్టిగా పట్టుకుని గిరగిరా తిప్పి, నేలకేసి కొట్టాడు. ఆ వెంటనే కన్నతల్లి హజీరా బేగం చిన్నారి నోరు మూసి గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటనపై వారి యజమాని ఖాసీం ఫిర్యాదు చేయడంతో మిల్స్ కాలనీ పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, విచారణ అనంతరం నేరం రుజువైందని తేలింది. దీంతో న్యాయమూర్తి నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
Hazeera Begum
Warangal crime
extra marital affair
child murder
Telangana crime news

More Telugu News