పైలట్ నమాన్ష్ కు రష్యా ఎయిర్ ఫోర్స్ నివాళి.. ఆకాశంలో మిస్సింగ్ మ్యాన్ విన్యాసం
- దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ కూలిపోవడంతో నమాన్ష్ దుర్మరణం
- హిమాచల్ ప్రదేశ్ లోని స్వగ్రామంలో నమాన్ష్ అంత్యక్రియలు పూర్తి
- కన్నీళ్లతో సెల్యూట్ చేస్తూ భర్తను సాగనంపిన వింగ్ కమాండర్ అప్షాన్
మిస్సింగ్ మ్యాన్ విన్యాసం అంటే..
పైలట్లు, సైనిక సిబ్బంది లేదా ప్రముఖ రాజకీయ నాయకుల మరణానికి సంతాపంగా, గౌరవ వందనం సమర్పించేందుకు నిర్వహించే వైమానిక ప్రదర్శనే ‘మిస్సింగ్ మ్యాన్ విన్యాసం’. ఆ వ్యక్తి లేని లోటును, వారి చివరి ప్రయాణానికి సూచనగా ఈ విన్యాసం నిర్వహిస్తారు. ఈ విన్యాసంలో నాలుగు విమానాలు "వి" ఆకారంలో తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. ఒక నిర్దిష్ట సమయంలో 3వ స్థానంలో ఉన్న విమానం, అకస్మాత్తుగా పైకి లేచి ఆకాశంలోకి దూసుకెళ్తుంది. మిగిలిన మూడు విమానాలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి, కానీ వాటి మధ్య ఖాళీ స్థలం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఖాళీ స్థలం మరణించిన వ్యక్తి లేకపోవడాన్ని సూచిస్తుంది.