Khaleda Zia: ఐసీయూలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా.. పరిస్థితి విషమం

Khaleda Zia in ICU Condition Critical
  • బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు తీవ్ర అస్వస్థత
  • గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిక
  • ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపిన వైద్యులు
  • యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తున్నామని వెల్లడి
  • వర్చువల్‌గా సాయం అందిస్తున్న అమెరికా వైద్య నిపుణులు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా (79) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమెను కుటుంబ సభ్యులు నిన్న రాత్రి ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఖలీదా జియాకు యాంటీబయాటిక్స్‌తో తక్షణ చికిత్స ప్రారంభించినట్లు ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్య బృందం వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్రిటికల్‌గానే ఉన్నప్పటికీ, త్వరలోనే మెరుగయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె చికిత్సకు అమెరికాలోని ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ ఆసుపత్రి నిపుణులు కూడా వర్చువల్‌గా సహాయం అందిస్తున్నారు.

ఈ సమాచారం తెలియగానే బీఎన్‌పీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. పార్టీకి చెందిన ముఖ్య నేతలు, సుమా షమీలా రహ్మాన్ వంటి వారు ఆసుపత్రి వద్దే ఉండి ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఖలీదా జియా గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
Khaleda Zia
Bangladesh
BNP
Bangladesh Nationalist Party
Dhaka Evercare Hospital
Johns Hopkins Hospital
Health Update
Former Prime Minister
Begum Khaleda Zia
ICU

More Telugu News