నాగచైతన్యా... 'వృషకర్మ'లో నీ లుక్ సూపర్ సాలిడ్ గా ఉంది: మహేశ్ బాబు
- నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన మహేశ్ బాబు
- బర్త్‌డే స్పెషల్‌గా చైతూ కొత్త సినిమా టైటిల్ ప్రకటన
- పవర్‌ఫుల్ యాక్షన్ లుక్‌తో ఆకట్టుకుంటున్న అక్కినేని హీరో
- విరూపాక్ష ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో మీనాక్షి చౌదరి హీరోయిన్
'వృషకర్మ' ఫస్ట్ లుక్‌లో నాగచైతన్య ఓ కోట ముందు చేతిలో ఆయుధంతో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఆయన లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు లవ్, యాక్షన్ కథలతో అలరించిన చైతూ, ఈ సినిమాతో పూర్తిగా కొత్త జానర్ అయిన మైథలాజికల్ థ్రిల్లర్‌ను ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఆయన ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించనుండగా, ఆయన సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ఆర్కియాలజిస్ట్ 'దక్ష' పాత్ర పోషిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో కొండలు, గుహలతో కూడిన ఓ భారీ సెట్‌ను నిర్మించి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఎస్‌వీసీసీ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామిగా ఉంది.