బెల్జియం భామతో సిక్కోలు యువకుడి వివాహం
శ్రీరంగనాథ్ సాహిత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా లండన్ లో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ తనతో పాటే పనిచేస్తున్న కెమిలీతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహ బంధంతో ఈ జంట ఒక్కటైంది. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కెమిలీ బంధుమిత్రులు వివాహ వేడుకకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు.