ఐబొమ్మ రవిని వారం రోజుల్లో బెయిల్‌పై తీసుకొస్తా: వైజాగ్ న్యాయవాది సలీం
- ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్టయిన ఇమంది రవి
- కేసు వాదించేందుకు రంగంలోకి దిగిన వైజాగ్ సీనియర్ న్యాయవాది
- సికింద్రాబాద్‌లో సలీంతో భేటీ అయిన జాతీయ మానవ హక్కుల కమిటీ
ఈ సందర్భంగా శనివారం సికింద్రాబాద్‌లో జాతీయ మానవ హక్కుల కమిటీ ఆఫ్ ఇండియా బృందం ఆయనను ప్రత్యేకంగా కలిసింది. కమిటీ జాతీయ అధ్యక్షుడు కటకం శ్రీనివాస్, జాతీయ కోశాధికారి తులసి, లీగల్ సలహాదారురాలు లక్ష్మిసౌజన్య, ఇతర సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు.
అనంతరం కటకం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం వారం రోజుల్లోనే ఐబొమ్మ రవిని బెయిల్‌పై బయటకు తీసుకొస్తానని న్యాయవాది సలీం హామీ ఇచ్చారని తెలిపారు. రవి, తాను ఇద్దరూ వైజాగ్‌కు చెందినవారేనని, అందుకే అతడిని బయటకు తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బందులనైనా ఎదుర్కొంటానని సలీం చెప్పినట్లు ఆయన వివరించారు.