Rashmika Mandanna: అది బలహీనత కాదు.. గొప్ప శక్తి: రష్మిక

Rashmika Mandanna on Feminine Energy Its a Great Strength
  • స్త్రీ శక్తిపై ఆసక్తికర పోస్ట్ పెట్టిన రష్మిక
  • ఏదైనా ముందే పసిగట్టే శక్తి మహిళలకు ఉంటుందన్న నటి
  • మహిళలు ఒకరికొకరు తోడుగా నిలిస్తే అద్భుతాలు జరుగుతాయని వెల్లడి
  • స్త్రీలంతా ఏకమైతే వారిని ఎవరూ ఆపలేరని వ్యాఖ్య
ప్రముఖ నటి రష్మిక మందన్న ‘ఫెమినైన్ ఎనర్జీ’ (స్త్రీ శక్తి)పై సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తన బిజీ షెడ్యూల్ నుంచి కొంత సమయం తీసుకుని, మహిళల్లో ఉండే ఈ ప్రత్యేక శక్తి గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"ఫెమినైన్ ఎనర్జీలో ఏదో ప్రత్యేకత ఉంది. దాన్ని ఎలా వివరించాలో నాకు తెలియదు. కానీ, మనతో మనం నిజంగా కనెక్ట్ అయినప్పుడు, పరిస్థితులను, వ్యక్తులను ఇట్టే అర్థం చేసుకోగలుగుతాం. ఏదైనా తప్పు జరగబోతోందని మనసు ముందే చెబుతుంది. కానీ కొన్నిసార్లు జీవితంలోని సంక్లిష్టతల వల్ల దాన్ని పట్టించుకోం" అని రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.

మహిళలు ఒకరికొకరు అండగా నిలవడం గురించి ఆమె ప్రస్తావిస్తూ, "మహిళలు ఒకరికొకరు అండగా నిలవడం, ఒకరి సమస్యలను మరొకరు ఓపికగా వినడం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు జీవితం మరికొంత సులభంగా మారుతుంది" అని తెలిపారు.

"ఈ ఫెమినైన్ ఎనర్జీని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇప్పుడు అర్థమైంది కాబట్టి, దీన్ని అన్ని విధాలా కాపాడుకుంటాను. ఫెమినైన్ ఎనర్జీ బలహీనమైంది కాదు. అది మృదువుగా ఉంటుంది. కానీ చాలా శక్తిమంతమైంది. ప్రేమతో నిండి ఉంటుంది. అలాంటి శక్తితో మహిళలందరూ ఏకమైతే, వారిని ఎవరూ ఆపలేరు" అంటూ తన పోస్ట్‌లో ర‌ష్మిక పేర్కొన్నారు.
Rashmika Mandanna
Feminine Energy
Women Empowerment
Social Media Post
Instagram
Female Strength
Actress Rashmika
Femininity
Support Women

More Telugu News