అమెజాన్‌లో కొత్త ఫీచర్ గమనించారా...?
- అమెజాన్ యాప్‌లో 'ప్రైస్ హిస్టరీ' పేరుతో కొత్త ఫీచర్
- గత 30-90 రోజుల్లో వస్తువు ధరల హెచ్చుతగ్గుల వెల్లడి
- గ్రాఫ్ రూపంలో ధరల కనిష్ఠ, గరిష్ఠ వివరాలు
- థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండా ధరల విశ్లేషణ
- సేల్స్ సమయంలో కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనం
ఇంతకుముందు ఒక వస్తువు ధరల చరిత్రను విశ్లేషించాలంటే కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్‌లు లేదా ఇతర వెబ్సైట్లపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ ఇబ్బందికి చెక్ పెడుతూ అమెజాన్ ఇప్పుడు తన యాప్‌లోనే ఈ సదుపాయాన్ని కల్పించింది. వినియోగదారులు ఏదైనా ప్రొడక్ట్‌ను ఎంపిక చేసుకుని, పేజీలో కిందికి స్క్రోల్ చేస్తే ధర వివరాల పక్కనే 'ప్రైస్ హిస్టరీ' ఆప్షన్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేయగానే, గత 30 నుంచి 90 రోజుల మధ్య ఆ వస్తువు నమోదైన కనిష్ఠ, గరిష్ఠ ధరలను ఒక గ్రాఫ్ రూపంలో స్పష్టంగా చూపిస్తుంది. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక సేల్స్ సమయాల్లో ఈ ఫీచర్ కొనుగోలుదారులకు సరైన నిర్ణయం తీసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.