The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Prabhas The Raja Saab First Single Release Date Announced
  • ‘రెబల్ సాబ్’ పేరుతో రానున్న ఫస్ట్ సింగిల్
  • ఎల్లుండి పాటను విడుదల చేయనున్నట్లు ప్ర‌క‌ట‌న‌
  • మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చేసింది. హారర్ కామెడీ జానర్‌లో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాట విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కు ‘రెబల్ సాబ్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుపుతూ.. ఈ పాటను ఎల్లుండి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండటంతో పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, బోమన్ ఇరానీతో పాటు జరీనా వహాబ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తుండగా, తాజా ప్రకటన వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
The Raja Saab
Prabhas
Maruthi
Rebel Saab
Thaman
Malavika Mohanan
Nidhi Agarwal
Telugu Movie
People Media Factory

More Telugu News