Bus Accident: మరో బస్సు ప్రమాదం.. యాసిడ్ ట్యాంకర్ ను ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు

Bus Accident Travelers Safe After Bus Hits Acid Tanker at Jadcherla
  • ఎన్ హెచ్ 44 పై ఘటన.. ట్యాంకర్ లో నుంచి భారీగా పొగలు
  • కిటికీలు పగలగొట్టి బయటపడ్డ ప్రయాణికులు
  • చిత్తూరు నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం
జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాసిడ్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది. గురువారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి (ఎన్ హెచ్) 44 పై చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ముందు వెళుతున్న యాసిడ్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ లో నుంచి భారీగా పొగలు వెలువడ్డాయి. జడ్చర్ల మండలం మాచారం దగ్గర 44వ జాతీయ రహదారి ఫ్లై ఓవర్పై ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఆకస్మిక పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వెంటనే బస్సు కిటికీలు పగలగొట్టుకుని బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నీళ్లతో పొగలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు.
Bus Accident
Jadcherla
Acid Tanker
NH 44
Chittoor
Hyderabad
Travel Bus Accident
Telangana
Road Accident

More Telugu News