Deepika Padukone: నాకు డబ్బులు ముఖ్యం కాదు: దీపికా పదుకొణె

Deepika Padukone Says Money Is Not Important
  • డబ్బు, బడ్జెట్ తన నిర్ణయాన్ని ప్రభావితం చేయవన్న దీపిక
  • ఆరోగ్యకరమైన పని వాతావరణానికే తన మొదటి ప్రాధాన్యత అని వెల్లడి
  • రోజుకు 8 గంటల పనివిధానం ఉండాలని వ్యాఖ్య
బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణె ఇటీవల రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులను తిరస్కరించడంపై స్పష్టత ఇచ్చారు. ప్రభాస్ హీరోగా రానున్న 'కల్కి' సీక్వెల్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని 'స్పిరిట్' సినిమాల్లో నటించకపోవడానికి కారణం పారితోషికం లేదా డేట్స్ కాదని, ఆరోగ్యకరమైన పని వాతావరణానికే తన తొలి ప్రాధాన్యత అని ఆమె వెల్లడించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన నిర్ణయంపై వస్తున్న విమర్శలకు దీపికా సమాధానమిచ్చారు. "సినిమా బడ్జెట్ రూ.100 కోట్లా లేక రూ.500-600 కోట్లా అనేది నా నిర్ణయాలపై ప్రభావం చూపదు. కొందరు భారీ పారితోషికం ఆఫర్ చేస్తారు. కానీ నాకు అది ముఖ్యం కాదు" అని ఆమె తెలిపారు. సినిమా స్థాయిని బట్టి తన ప్రాధాన్యతలు మారవని ఆమె పరోక్షంగా వెల్లడించారు.

ఆరోగ్యకరమైన పని వాతావరణం ఉన్నప్పుడే ఉత్తమమైన నటనను ఇవ్వగలమని దీపిక పేర్కొన్నారు. "ప్రతిరోజూ ఎనిమిది గంటల పనివేళలు సరిపోతాయి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన పనిలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలం" అని ఆమె వివరించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, దీపికా పదుకొణె ఇటీవలే ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'లో కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రంలో (AA22xA6) కథానాయికగా నటిస్తున్నారు.
Deepika Padukone
Kalki 2898 AD
Prabhas
Spirit Movie
Sandeep Reddy Vanga
Pan India Projects
Bollywood Actress
AA22xA6
Allu Arjun
Atlee

More Telugu News