Radha Krishna Kumar: 'రాధేశ్యామ్' డైరెక్టర్ రాధాకృష్ణ ఇంట్లో విషాదం

Radhe Shyam Director Radha Krishna Loses Mother
  • రాధాకృష్ణ తల్లి కన్నుమూత
  • సోషల్ మీడియాలో తల్లి గురించి భావోద్వేగ పోస్ట్
  • ఈ నెల 15నే తుదిశ్వాస విడిచిన తల్లి రమణి
  • విషయాన్ని ఆలస్యంగా వెల్లడించిన దర్శకుడు
  • రాధాకృష్ణకు సంతాపం తెలుపుతున్న సినీ ప్రముఖులు
ప్రభాస్‌తో 'రాధేశ్యామ్' చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి రమణి (60) కన్నుమూశారు. ఈ నెల 15వ తేదీనే ఆమె తుదిశ్వాస విడవగా, ఈ విషయాన్ని రాధాకృష్ణ తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆయనకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

తల్లిని గుర్తుచేసుకుంటూ రాధాకృష్ణ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "ప్రపంచంలో నాకంటూ ఓ స్థానం ఇచ్చావు. నా మనసులో శూన్యత మిగిల్చి వెళ్లిపోయావు. నీతో ఇన్నాళ్లు బతికిన జీవితమే ఓ సెలబ్రేషన్ అమ్మా...! నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా మై ఫస్ట్ లవ్" అని ఆవేదన వ్యక్తం చేశారు.

రాధాకృష్ణ కుమార్ కెరీర్ విషయానికొస్తే, ఆయన ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వద్ద 'అనుకోకుండా ఒకరోజు', 'ప్రయాణం', 'సాహసం' వంటి చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు. గోపీచంద్‌ హీరోగా వచ్చిన 'జిల్' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. రెండో చిత్రానికే ప్రభాస్‌తో 'రాధేశ్యామ్' వంటి పాన్-ఇండియా సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు. 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత ఆయన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. 
Radha Krishna Kumar
Radha Krishna
Radhe Shyam director
Director Radha Krishna Kumar
Radha Krishna mother
Ramani
Prabhas
Telugu cinema
Tollywood
Director death

More Telugu News