Chandrababu Naidu: నితీశ్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, లోకేశ్... ఈ నెల 20న పాట్నాకు పయనం

Chandrababu Naidu and Nara Lokesh to Attend Nitish Kumar Swearing in Ceremony
  • బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం
  • ఎల్లుండి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం
  • ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఇరువురు నేతలు ఈ నెల 20వ తేదీన పాట్నాకు వెళ్లనున్నారు.

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి నారా లోకేశ్ ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన రాష్ట్రంలో పర్యటించి, పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా, తన పర్యటనలో భాగంగా పలువురు బీహార్ పారిశ్రామికవేత్తలతో సమావేశమై చర్చలు జరిపారు.

ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని వచ్చిన ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాట్నా వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 20వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో వారు పాల్గొని నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలియజేయనున్నారు.
Chandrababu Naidu
Nara Lokesh
Nitish Kumar
Bihar
Andhra Pradesh
JDU
Patna
Bihar Assembly Elections

More Telugu News