Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు.. ఎప్పటి నుంచంటే!

Tirumala Vaikunta Dwara Darshan from December 30
  • డిసెంబర్ 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
  • వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం
  • సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్యులకే పెద్దపీట
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30వ తేదీ నుంచి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. పది రోజుల పాటు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులలో సామాన్యులకు ప్రాధాన్యం కల్పిస్తామని టీటీడీ ఈవో పేర్కొన్నారు.

వైకుంఠ ద్వార దర్శన సమయం మొత్తం 182 గంటలు కాగా ఇందులో 164 గంటలు సాధారణ భక్తులకే కేటాయిస్తామని ఆయన చెప్పారు. ఈ నిర్ణయంతో సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునే వెసులుబాటు కలుగుతుందని టీటీడీ పాలకమండలి పేర్కొంది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీడీ ఈవో ఈ వివరాలను వెల్లడించారు.
Tirumala
Vaikunta Dwara Darshan
Tirumala Tirupati Devasthanam
TTD
Vaikunta Ekadasi
Chandrababu Naidu
Andhra Pradesh
Tirupati Temple

More Telugu News