California jewelry store robbery: దుకాణంలో చొరబడ్డ దొంగలపైకి కాల్పులు జరిపిన యజమాని.. వీడియో ఇదిగో!

California jewelry store owner shoots at robbers
  • కాలిఫోర్నియాలోని నగల దుకాణంలో ఘటన
  • నగల చోరీకి ముసుగు దొంగల విఫలయత్నం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ నగల దుకాణంలో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు. ముఖానికి ముసుగులు ధరించి, ఆయుధాలతో దుకాణంలోకి చొరబడ్డారు. అయితే, షాపు యజమాని తన తుపాకీతో కాల్పులు జరపడంతో దొంగలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒలీవియా ఫైన్ జ్యువెలరీ స్టోర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
ఈ నెల 13న సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో కొంతమంది నల్లటి దుస్తులు, ముసుగులు ధరించి స్టోర్ లోకి చొరబడ్డారు. ఒక్కసారిగా దుండగులు లోపలికి రావడంతో షాపులోని సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. దుండగుల చేతుల్లోని ఆయుధాలను చూసి చేతులెత్తేశారు. ఓ క్లర్క్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం వీడియోలో కనిపిస్తోంది. 

అయితే, దుండగులను చూసిన వెంటనే వేగంగా ప్రతిస్పందించిన షాపు యజమాని.. తన లైసెన్స్ డ్ రివాల్వర్ ను తీసుకొచ్చి వారిపై కాల్పులు జరిపాడు. ఊహించని ఈ ప్రతిఘటనతో దొంగలు తోకముడిచారు. ప్రాణభయంతో షాపులో నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ ఘటనపై ఒలీవియా జ్యువెలరీ స్టోర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
California jewelry store robbery
jewelry store robbery
California robbery
Olivia Fine Jewelry Store
gun owner
store owner shooting
robbery foiled
crime news
US crime

More Telugu News