షామీర్ పేటలో చైన్ స్నాచింగ్.. వీడియో ఇదిగో!
- జనం చూస్తుండగానే మహిళ మెడలో నుంచి గోల్డ్ చైన్ ఎత్తుకెళ్లిన దొంగలు
- సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన చోరీ
- దొంగలను వెంటాడే క్రమంలో కింద పడ్డ మహిళ
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూంకుంటలోని ఓ పాఠశాలలో మల్కారం జమున ఆయాగా పనిచేస్తోంది. ఇటీవల అనారోగ్యం కారణంగా కొంతకాలం స్కూలుకు వెళ్లలేదు. తిరిగి విధుల్లో చేరేందుకు సోమవారం ఉదయం ఆసుపత్రి నుంచి సర్టిఫికెట్ తీసుకొని స్కూలుకు బయలుదేరింది. ఇంతలో బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలో నుంచి మంగళసూత్రాన్ని తెంచుకొని పారిపోయారు. దుండగులు కర్చీఫ్ కట్టుకోవడంతో ముఖాలు కనిపించలేదని, బైక్ నెంబర్ ఆధారంగా వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.