Rana Daggubati: భాగ్యశ్రీని పొగడ్తలతో ముంచెత్తిన రానా!

Rana Daggubati Praises Bhagyashree Borses Dedication in Kanta
  • 'కాంత' హీరోయిన్ భాగ్యశ్రీపై రానా ప్రశంసల వర్షం
  • ఆమె అంకితభావం, నిజాయతీ అసాధారణమని కొనియాడిన రానా
  • సినిమా కోసం భాగ్యశ్రీ ఆరు నెలల్లో తమిళం నేర్చుకుందని ప్రశంస
  • తనను మెంటార్‌గా అభివర్ణిస్తూ భాగ్యశ్రీ పెట్టిన పోస్ట్‌పై స్పందన
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి తాను కీలక పాత్రలో నటించిన 'కాంత' సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల భాగ్యశ్రీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో రానాను నిజమైన స్నేహితుడని, తన మెంటార్ అని అభివర్ణించింది. ఈ పోస్ట్‌పై రానా స్పందిస్తూ భాగ్యశ్రీ అంకితభావాన్ని, వృత్తిపట్ల ఆమెకున్న నిజాయతీని కొనియాడాడు.

ఈ విషయంపై రానా మాట్లాడుతూ "భాగ్యశ్రీ అలా చెప్పడం ఆమె మంచితనం. ఆమె చాలా సిన్సియర్. ఈ సినిమా కోసం బాంబే నుంచి వచ్చిన ఆమె, తమిళం నేర్చుకోవాలని మేము చెప్పగానే ఏకంగా ఆరు నెలల పాటు ఇక్కడే ఉండి భాష నేర్చుకుంది. ఈ రోజుల్లో ఇంతటి అంకితభావం చూడటం చాలా అరుదు. ఆమె నిజాయతీ అసాధారణం" అని పేర్కొన్నాడు.

"ప్రారంభంలో మేము కొంచెం కంగారుపడ్డాం. దుల్కర్ సల్మాన్, సముద్రఖని వంటి గొప్ప నటులతో సరిపోయే కొత్త అమ్మాయి కావాలని అనుకున్నాం. కానీ ఆమె నటిస్తేనే అది సాధ్యమవుతుంది. అయితే, టెస్ట్ షూట్ ప్రారంభమైన కొద్ది రోజులకే మా 'కుమారి' పాత్రకు సరైన నటి దొరికిందని మాకు అర్థమైంది" అని రానా వివరించాడు.

'కాంత' యూనిట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భాగ్యశ్రీ పెట్టిన పోస్ట్‌లో "మొదటి రోజు నుంచి నాకు మద్దతుగా నిలిచిన రానాకు ధన్యవాదాలు. మీరు నా ప్రయాణంలో ఒక మెంటార్. మీ మార్గదర్శకత్వం లేకపోతే నేను ఇది చేయగలిగేదాన్ని కాదు" అని పేర్కొంది. 1950ల నాటి మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామా థ్రిల్లర్‌ను స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Rana Daggubati
Bhagyashree Borse
Kanta Movie
Dulquer Salmaan
Tamil Cinema
Telugu Cinema
Samuthirakani
Period Drama Thriller
Spirit Media
Wayfarer Films

More Telugu News