Dhruv Vikram: ఓటీటీకి తమిళ హిట్ మూవీ!

Bison Movie Update
  • ధ్రువ్ హీరోగా రూపొందిన 'బైసన్'
  • తమిళంలో హిట్ కొట్టిన సినిమా 
  • ఈ నెల 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో 
  • ఐదు భాషల్లో అందుబాటులోకి

తమిళంలో ఇటీవల కాలంలో యూత్ ఎక్కువగా మాట్లాడుకున్న పేరు 'బైసన్'. సీనియర్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు 'ధ్రువ్'  హీరోగా చేసిన సినిమా ఇది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. తమిళంలో ఈ సినిమా భారీ హిట్ ను సాధించింది. తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే పబ్లిసిటీ పెద్దగా లేని కారణంగా పట్టించుకోలేదు. కాకపోతే చూసినవాళ్లు బాగానే ఉందన్నారు.

ఈ సినిమాను థియేటర్లలో చూడనివాళ్లు ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక వాళ్ల నిరీక్షణకు తెరపడనుంది. ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా 'నెట్ ఫ్లిక్స్' వారు అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, పశుపతి .. అమీర్ .. లాల్ .. రజీషా విజయన్ ముఖ్యమైన పాత్రలలో నటించారు.       
 
ఈ కథ 1990లలో నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో కథానాయకుడికి చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే ఇష్టం. కబడ్డీ పట్ల అతని ఆసక్తిని చూస్తూ వచ్చిన కుటుంబ సభ్యులు, అతణ్ణి ప్రోత్సహిస్తారు. గ్రామస్థాయిలో .. జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకున్న అతను, మరింత ఎదగడానికి ప్రయత్నిస్తాడు. ఆ దిశగా అతను అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి వివక్షకు గురవుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితులలో అతను ఏం చేస్తాడు? అనేదే కథ.


Dhruv Vikram
Bison movie
Mari Selvaraj
Anupama Parameswaran
Netflix streaming
Kabaddi movie
Tamil movie OTT release
Bison OTT release date
Pasupathi
Tamil cinema

More Telugu News