Balakrishna: బాలయ్య జోలికి వస్తే చర్మం ఒలిచేస్తా: వైసీపీకి ఎమ్మెల్యే మాస్ వార్నింగ్
- హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తల దాడి
- బాలకృష్ణపై వైసీపీ నేతల వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం
- కొందరు చిల్లర వెధవలు బాలయ్య గురించి మాట్లాడారన్న ఎమ్మెస్ రాజు
వైసీపీకి శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తన అభిమాన నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జోలికి వస్తే చర్మం ఒలిచేస్తామంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాను బాలయ్య అభిమానిగా ఈ హెచ్చరిక చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
హిందూపురంలో బాలకృష్ణపై కొందరు వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే ఈ వివాదం మొదలైందని రాజు పేర్కొన్నారు. "హిందూపురంలో కొందరు చిల్లర వెధవలు బాలయ్య గురించి మాట్లాడారు. దీంతో ఆవేశానికి లోనైన మా కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఇది మీకు, మీ అధినేతకు కూడా మా హెచ్చరిక" అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, హిందూపురంలోని వైసీపీ కార్యాలయంతో పాటు, పార్టీ ఇన్ఛార్జ్ దీపిక రెడ్డి భర్త కార్యాలయంపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.