Andhra Pradesh Rains: ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ

Andhra Pradesh Rains Alert Issued for Several Districts
  • నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
  • ఏపీలో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ 
  • నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడి
  • ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరులో తేలికపాటి జల్లులు పడవచ్చన్న వాతావరణ శాఖ 
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచన
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నందున ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇటీవలి తుఫాను ప్రభావం నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోకముందే, మరోసారి వర్ష సూచన రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా, మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉందని, ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలని అధికారులు కోరారు. 
Andhra Pradesh Rains
AP Weather
Nellore
Tirupati
Heavy Rainfall Alert
IMD Forecast
Cyclone Effect
Andhra Pradesh Floods
Rayalaseema Districts
AP Disaster Management

More Telugu News